ఉద్యోగులు తమ సమస్యలను, కొంతమంది తమ జాబ్ అనుభవాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లోనే.. ఉద్యోగానికి రాజీనామా చేశానని ఒక వ్యక్తి రెడ్డిట్‌లో పేర్కొన్నారు.
నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. నెలకు రూ. 12000 జీతం. కానీ ఉద్యోగంలో చేరిన మూడు గంటలలోనే రాజీనామా చేశాను, అని పేర్కొన్నారు. దీనికి కారణం రోజుకు 9 గంటల షిఫ్ట్ అని అన్నాడు. మొదట్లో ఈ పని చేయాలనుకున్నాను. కానీ ఈ జాబ్ నా సమయాన్ని మొత్తం వృధా చేస్తుందని వెల్లడించాడు. ఈ ఉద్యోగంతో కెరీర్‌లో నేను ఎదగలేనని గ్రహించాను. కాబట్టే ఉద్యోగాన్ని వదులుకున్నాను అని అన్నాడు.

నేను పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్నాను. ఈ సమయంలో ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ ఉంటే బాగుంటుందని సెర్చ్ చేసాను. మొదట్లో నేను ఇలాంటి ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు.. పార్ట్-టైమ్ గిగ్‌గా ఉంది. ఆ తరువాత అది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నావని ప్రశంసిస్తే, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందే అన్నీ సరిగ్గా చూసుకోవాలని ఇంకొందరు అన్నారు.


