టాప్ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ. 20వేల కంటే తక్కువే.. | Top 10 Smartphones You Can Buy Under Rs 20000 on Amazon and Flipkart | Sakshi
Sakshi News home page

టాప్ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ. 20వేల కంటే తక్కువే..

Sep 25 2025 7:20 PM | Updated on Sep 25 2025 8:26 PM

Top 10 Smartphones You Can Buy Under Rs 20000 on Amazon and Flipkart

అసలే పండుగ సీజన్.. ఈ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్స్ ప్రకటిస్తాయని, ఓ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసింది. ఈ కథనంలో రూ. 20వేలకంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

రెడ్‌మీ ఏ4 5జీ: రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్ ధర అమెజాన్‌లో రూ.7,499 మాత్రమే. ఇది మార్కెట్లోని అత్యంత సరసమైన 5జీ-రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.

రియల్‌మి నార్జో 80 లైట్: అమెజాన్‌లో రూ. 8,999 ధరకు లభించే ఈ ఫోన్ మంచి పనితీరును అందిస్తుంది. విద్యార్థులకు, సాధారణ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

లావా స్టార్మ్ ప్లే 5జీ: అమెజాన్‌లో రూ.8,999 ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఈ విభాగంలోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది మంచి స్టోరేజ్ కూడా పొందుతుంది.

ఐకూ జెడ్10 లైట్ 5జీ: అమెజాన్‌లో రూ. 8,999 ధరకు లభించే ఐకూ జెడ్10 లైట్ 5జీ.. లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ వంటి వాటికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒప్పో కే13ఎక్స్: ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499 ధరకు లభించే.. ఒప్పో కే13ఎక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. ఇది మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉండటమే కాకుండా.. స్టైలిష్ డిజైన్ పొందుతుంది.

పోకో ఎం7 ప్లస్: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999 ధరకు లభించే పోకో ఎం7 ప్లస్.. స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తూ పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అయిన ఈ ఫోన్ గేమింగ్ వంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒప్పో కే13: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999 వద్ద ఉన్న.. ఒప్పో కే13 అనేది ఒక స్టైలిష్ మిడ్-రేంజ్ ఫోన్. ఇది మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా ఫీచర్ బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

వివో టీ4ఎక్స్: ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,249 కు లభించే వివో టీ4ఎక్స్ కూడా తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మొబైల్. ఇది మల్టీ టాస్కింగ్‌ ఫోన్. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.

ఐక్యూఓ జెడ్10ఎక్స్: అమెజాన్‌లో రూ.11,999 ధరకు లభించే ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఇది ఒకటి.

రియల్‌మి పీ4 & సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో: వీటి ధరలు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999. రియల్‌మే పీ4 లేటెస్ట్ డిజైన్‌ కలిగి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో మంచి హార్డ్‌వేర్‌తో మినిమలిస్టిక్ స్టైలింగ్‌ పొందుతుంది. కాబట్టి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement