TG: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఉద్యోగాల భర్తీ | TSLPRB released job notification for 1,743 jobs | Sakshi
Sakshi News home page

TG: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఉద్యోగాల భర్తీ

Sep 17 2025 6:50 PM | Updated on Sep 17 2025 7:46 PM

TSLPRB released job notification for 1,743 jobs

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో డ్రైవర్స్ ,శ్రామిక్‌లు (Shramiks) పోస్టులు ఉన్నాయి. వాటి వివరాల‍్ని పరిశీలిస్తే..

డ్రైవర్స్ పోస్టులు – 1000 ఖాళీలు
అర్హతలు: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్‌ఎస్‌ఈ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
పురుషులు,మహిళలు ఇద్దరూ అర్హులు.
వయస్సు పరిమితి: సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాలు.

వయస్సు సడలింపు:
ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌: 5 సంవత్సరాలు
మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు

ఎంపిక విధానం:
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్
డ్రైవింగ్ టెస్ట్
వెయిటేజ్ మార్కులు
కనీస అర్హత మార్కులు

శ్రామిక్ పోస్టులు – 743 ఖాళీలు
అర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత 
పురుషులు,మహిళలు అర్హులు.
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు.

వయస్సు సడలింపు:
ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌: 5 సంవత్సరాలు
మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు

ఎంపిక విధానం:
వెయిటేజ్ మార్కులు
కనీస అర్హత మార్కులు

దరఖాస్తు వివరాలు: 
ఆన్‌లైన్ దరఖాస్తు: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్
దరఖాస్తు ప్రారంభ తేదీ:అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటలకు
దరఖాస్తు ముగింపు తేదీ :అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలకు

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అర్హతలు కలిగిన అభ్యర్ధులు అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement