సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్న స్పీకర్.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు.
ఎమ్మెల్యేలు, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్ల ఎక్కడా ఆధారాలు లేవన్నారు. బీఆర్‌ఎస్ వాదనతో స్పీకర్ ఏకీభవించలేదు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుగురి ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. స్పీకర్ దగ్గర మాకు న్యాయం దక్కలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కోసం కోర్టులను ఆశ్రయిస్తాం. కండువాలు కప్పుకుని పార్టీ మారినా వేటు వేయలేదు. న్యాయం కోసంకచ్చితంగా కోర్టు తలుపులు తడతాం’’ అని పల్లా చెప్పారు.


