సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్‌మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కి మార్చింది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే సరైన ముహూర్తాలు లేవని.. కావున అపాయింటెడ్ డే ను ఈ నెల 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్ డేను రెండు రోజుల పాటు వాయిదా వేసి, డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు అదే రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.


