కర్ణాటక: డిసెంబర్ చలిలో వేడిగా నాన్ వెజ్ తినేవారికి ధరల షాక్ తగిలింది. డజన్ గుడ్ల ధర ఇప్పటికే రూ.95– 100 కు చేరుకుంది. చికెన్ ధర కూడా ఆకాశాన్నంటుతోంది. లైవ్ చికెన్ రిటైల్ ధర కేజీ రూ.170 నుంచి 180 మధ్య ఉంది. కోడి మాంసం ధర కిలో రూ.270 కి ఎగబాకింది. దీనికి కారణం.. శీతాకాలంలో గిరాకీ పెరగడం. అలాగే క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అధికమైంది. కోడి దాణా ధరలు పెరిగాయని పౌల్ట్రీదారులు చెబుతున్నారు. మునుముందు కేజీ చికెన్ రూ.300 దాటినా ఆశ్చర్యం లేదని అన్నారు.


