హీరో స్ప్లెండర్ కొత్త ధరలు | Hero Splendor Plus Gets Price Hike | Sakshi
Sakshi News home page

హీరో స్ప్లెండర్ కొత్త ధరలు

Jan 19 2026 9:15 PM | Updated on Jan 19 2026 9:20 PM

Hero Splendor Plus Gets Price Hike

మూడు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ఇతర కంపెనీల బాటలోనే హీరోమోటోకార్ప్ అడుగులు వేస్తూ.. ధరలను కేవలం రూ. 250 మాత్రమే పెంచింది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇతరత్రా కారణాల వల్ల ధరను పెంచడం జరిగిందని సంస్థ పేర్కొంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులోని 100 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 7.09 bhp & 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కంపెనీ ఈ బైక్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ముందు భాగంలో అదే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: టాటా సియెర్రా కారు కొన్న మంత్రి

ధరల పెరుగుదల తరువాత హీరో స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 73,902 నుంచి రూ. 74,152 వద్దకు చేరింది. ఐ3ఎస్ వేరియంట్ రూ. 75,055 నుంచి రూ. 75,305 వద్దకు, ఎక్స్‌టెక్‌ ధర రూ. 77,428 నుంచి రూ. 77,678 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డ్రమ్) వేరియంట్ ధర రూ. 79,964 నుంచి రూ. 80,214 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డిస్క్) వేరియంట్ ధర రూ. 80,471 నుంచి రూ. 80,721 వద్దకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement