మేము ఓట్లు వెయ్యం.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు | Villagers boycotted Panchayat Elections in Medepalli Gram Panchayat | Sakshi
Sakshi News home page

మేము ఓట్లు వెయ్యం.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

Dec 17 2025 12:08 PM | Updated on Dec 17 2025 12:50 PM

Villagers boycotted Panchayat Elections in Medepalli Gram Panchayat

సాక్షి, ఖమ్మం జిల్లా: తుదివిడత పల్లె పోరు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. అయితే ఓ గ్రామ పంచాయతీలో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఎందుకంటే గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లు అడగడానికి మాత్రమే మేము రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తాం లేకపోతే మేము ఎవరికీ కనపడం అంటూ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement