
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్‌బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్‌ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్‌లను నియమించుకోనుంది. వీరు గ్రోక్‌కు గేమ్‌లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.
ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్‌గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్‌గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!
జీతం & ప్రయోజనాలు
ఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు.