
కార్పొరేట్ ఉద్యోగాలు నీటిమీద బుడగలాగా మారిపోయాయి. ఎప్పుడు జాబ్ పోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీనికి కారణం కొన్ని కంపెనీల ప్రవర్తనే. ఇటీవల ఒక కంపెనీ నాలుగు నిముషాల మీటింగ్ తరువాత.. లేఆఫ్స్ అంటూ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాకు చెందిన ఒక కంపెనీలో.. రిమోట్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్‌లో తనకు ఎదురైన ఆకస్మిక & షాకింగ్ లేఆఫ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నేను ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాను. 11 గంటలకు కంపెనీ సీఓఓ భారతదేశానికి చెందిన ఉద్యోగులతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే సాగింది.

నాలుగు నిమిషాల మీటింగ్‌లోనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మీటింగ్ పూర్తైన తరువాత మెయిల్స్ అందుతాయని చెప్పాడు. తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కాదని, అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఇది విన్న నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను.
ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
ఉద్యోగులను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ముందస్తు సరైన సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం. అక్టోబర్ నెల పూర్తి జీతం నెలాఖరులోగా చెల్లిస్తామని, పెండింగ్‌లో ఉన్న సెలవులను నగదుగా మారుస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని ఉద్యోగి పేర్కొన్నారు. నేను ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి, ఇది నిజంగా బాధాకరం వెల్లడించారు.