కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను ఎప్పుడు, ఎందుకు జాబ్ నుంచి తొలగిస్తున్నాయో కూడా తెలియకుండా తీసేస్తున్నాయి. రాత్రిలో మెయిల్స్ పంపిన సంస్థలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా.. ఒక మహిళ తాను పనిచేయని కంపెనీ నుంచి తొలగింపు మెయిల్ పొందింది.
సైమన్ ఇంగరి అనే ఎక్స్ యూజర్.. ''నా భార్య ఎప్పుడూ పని చేయని కంపెనీలో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఒక మెయిల్ పొందిందని వెల్లడించారు''. ఈ మెయిల్ చూసిన నా భార్య ఒక్కసారిగా షాకైంది. వచ్చిన మెయిల్.. తాను పనిచేయని కంపెనీ అని తెలుసుకునే లోపే భయానికి గురైందని అన్నారు. అంతే కాకుండా.. ఎవరికైనా ఇలాంటి సందేశాలను పంపే ముందు మెయిల్ ఐడీ జాగ్రత్తగా గమనించాలని హెచ్‌ఆర్‌కు చెబుతూ.. ఇలాంటి తప్పుడు మెయిల్స్ వల్ల ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సూచించారు.
ఇదీ చదవండి: సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
సైమన్ ఇంగరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో పెరుగుతున్న నిర్లక్ష్యం & ఉద్యోగ అభద్రతకు ఇదొక ఉదాహరణ అని చెబుతున్నారు. ఇది చిన్న తప్పు కాదు. ఒక ఉద్యోగి మానసిక స్థితిని దెబ్బతీస్తుందని అన్నారు.
My wife received a termination email in 2025 December.
Her heart dropped after seeing it. She froze for a second.
Did she miss a deadline? Did she say something wrong?
Turns out, she just got terminated from a company she didn't even work for.
Dear HR, please check the email…— Simons (@Simon_Ingari) December 25, 2025


