
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.
ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.
ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలు
టెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.
పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలు
క్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు.