
వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాల వల్ల చాలామంది నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కకపోవడం ఎవరికైనా మనస్తాపం కలిగిస్తుంది. పనిచేసే చోట రాజకీయాల వల్ల తరచుగా నష్ట΄ోతూ ఉన్నట్లయితే విరక్తిలో కూరుకుపోతారు. ఇలాంటి దుస్థితిని ఎలా అధిగమించాలంటే...
అసూయాపరుల కారణంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలంటే, శుక్రవారం రాత్రివేళ కిలో మినుములను నీట్లో నానబెట్టండి. శనివారం ఉదయం స్నానాదికాల తర్వాత ముందురోజు నానబెట్టిన మినుములను ఒక పళ్లెంలోకి తీసుకోండి. ఆ మినుములను మూడు సమ భాగాలుగా చేయండి. ఒక భాగాన్ని గుర్రానికి, ఒక భాగాన్ని గేదెకు, ఒక భాగాన్ని ఆవుకు తినిపించండి.
ప్రభుత్వోద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ జీవితంలో అవరోధాలు తొలగిపోవాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. ప్రతి ఆదివారం ఒక చిన్న బెల్లంముక్కను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి.
ఉద్యోగ జీవితంలో కుట్రలు కుతంత్రాలకు బాధితులు బలి కాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. శుక్రవారం ఉదయం స్నానాదికాల తర్వాత దేవీ ఆర్గళ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్రతతో పఠించండి. అనాథ బాలికలకు కొత్త దుస్తులు ఇవ్వండి.
ఉద్యోగ జీవితంలో పురోగతికి ఏర్పడుతున్న అవరోధాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానాదికాలు, నిత్యపూజ తర్వాత రావిచెట్టు మొదట్లో గుప్పెడు నానబెట్టిన మినుములు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదనగా ఉంచి, నీలిరంగు పూలతో పూజించాలి. గాయత్రీ హోమం చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.
– సాంఖ్యాయన
విజయం కోసం... జయ శ్లోకం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్
జయశ్లోకం అనే పేరుగల ఈ శ్లోకాన్ని మన కోరికను లేదా సమస్యను బట్టి శుచిగా ఉండి 5/11/21/40 రోజులపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో చదువుకుంటూ హనుమంతుడికి అరటిపండ్లు నివేదించడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యలైనా తీరిపోతాయని ప్రతీతి.
మంచి మాటలు
- మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు. అది ఎంత
- మందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటపుడు మనం
- కనపడాల్సిన అవసరం లేదు. మంచితనం కనపడితే చాలు.
- చిరునవ్వును మించిన అలంకరణ లేదు. వినయాన్ని మించిన ఆభరణం లేదు.
- డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది. కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది.
- మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు’.
- చెడుని ప్రశ్నించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడుని తొలగిస్తుంది’.