
కొంతమంది ఎక్కువ జీతం కోసం పనిచేస్తే.. మరికొందరు ఉన్న జీతంతోనే సర్దుకుంటారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక టెక్నీషియన్ ఇటీవల రెడ్డిట్‌లో చేసిన పోస్ట్.. జీతం కంటే పని - జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చర్చకు దారితీసింది.
నాకు రెండు ఆఫర్లు వచ్చాయి, ఒకటి ఏడాదికి 38 లక్షల ప్యాకేజీ. మరొకటి సంవత్సరానికి 45 లక్షల ప్యాకేజీతో భారతదేశంలోని అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అని వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే నేను నా ప్రస్తుత స్థానం గుర్గావ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ (బెంగళూరులో) పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేశానేమో అనే భావన గలుగుతోంది. నేను డబ్బును ఎంచుకోవాలా లేదా స్థిరత్వాన్ని ఎంచుకోవాలా? అని అన్నారు.
రెడ్దిట్ తూజార్ తన కెరీర్ గురించి కూడా వెల్లడించారు. తాను ప్రారంభంలో రూ. 3.8 లక్షల ప్యాకేజితో ఉద్యోగంలో చేరినట్లు, ఆ తరువాత మూడు ఉద్యోగాలు మార్చినట్లు, దీని ఫలితంగా తన ప్రస్తుత వార్షిక జీతం పెరిగిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓ
ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది.. టెక్నీషియన్ ఉద్యోగాన్ని వదులుకోవడం గురించి చింతించవద్దని.. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని చెప్పారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని ఇంకొకరు అన్నారు. మీ జీతం పెరిగిన తరువాత.. పని సంస్కృతి & మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుందనే విషయాన్ని గమనించాలని ఇంకొకరు అన్నారు.