breaking news
Job rejections
-
'రూ.45 లక్షల వేతనం.. అందుకే వదిలేసా'
కొంతమంది ఎక్కువ జీతం కోసం పనిచేస్తే.. మరికొందరు ఉన్న జీతంతోనే సర్దుకుంటారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక టెక్నీషియన్ ఇటీవల రెడ్డిట్‌లో చేసిన పోస్ట్.. జీతం కంటే పని - జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చర్చకు దారితీసింది.నాకు రెండు ఆఫర్లు వచ్చాయి, ఒకటి ఏడాదికి 38 లక్షల ప్యాకేజీ. మరొకటి సంవత్సరానికి 45 లక్షల ప్యాకేజీతో భారతదేశంలోని అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అని వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే నేను నా ప్రస్తుత స్థానం గుర్గావ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ (బెంగళూరులో) పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేశానేమో అనే భావన గలుగుతోంది. నేను డబ్బును ఎంచుకోవాలా లేదా స్థిరత్వాన్ని ఎంచుకోవాలా? అని అన్నారు.రెడ్దిట్ తూజార్ తన కెరీర్ గురించి కూడా వెల్లడించారు. తాను ప్రారంభంలో రూ. 3.8 లక్షల ప్యాకేజితో ఉద్యోగంలో చేరినట్లు, ఆ తరువాత మూడు ఉద్యోగాలు మార్చినట్లు, దీని ఫలితంగా తన ప్రస్తుత వార్షిక జీతం పెరిగిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది.. టెక్నీషియన్ ఉద్యోగాన్ని వదులుకోవడం గురించి చింతించవద్దని.. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని చెప్పారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని ఇంకొకరు అన్నారు. మీ జీతం పెరిగిన తరువాత.. పని సంస్కృతి & మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుందనే విషయాన్ని గమనించాలని ఇంకొకరు అన్నారు. -
గూగుల్ టెకీ వింత అనుభవం.. ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా?
ఉద్యోగం కోసం ఏదైనా సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తూ ఉంటారు. తగిన అర్హతలు, అనుభవం లేకపోవడం వంటివి సాధారణంగా ఆ కారణాల్లో ఉంటాయి. అయితే తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి ఓ గూగుల్ టెకీ సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేశారు. అయితే ఇందుకు ఆ కంపెనీ చెప్పిన కారణమే విడ్డూరంగా అనిపించింది. "మీ రెజ్యూమ్ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ రోజులు పని చేయలేరని, చేరిన కొద్దిరోజులకే వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అంటూ తిరస్కరణకు కారణాన్ని రిజెక్షన్ లెటర్లో రిక్రూటర్ వివరించారు.ఇదీ చదవండి: అమెజాన్ ఉద్యోగులకు కొత్త పాలసీ.. తేల్చిచెప్పేసిన సీఈవోమంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరిస్తారని తనకు తెలియదంటూ రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను అనూ శర్మ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకు రిజెక్ట్ చేశారని ఓ యూజర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3— Anu Sharma (@O_Anu_O) October 17, 2024 -
ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు
ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం. ఆ వ్యక్తి ఆ పొజిషన్‌కు సరిపోడనుకోవడం. వగైరా.. వగైరా. కానీ, కేవలం ఫోన్ నెంబర్లో ఓ దురదృష్టకరమైన సంఖ్య ఉందని చెప్పి... అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్ నెంబర్లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్డాంగ్లోని షెంగెన్కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా... ఇప్పటికీ అతీత శక్తులను, మూఢ నమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో దీనిపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా వివక్ష చూపడమేనంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు. -
40 సార్లు జాబ్ రిజెక్ట్: అతని పేరుతో వణుకు!
ఆ తాత ఎంతో ప్రేమతో తన మనవడికి పేరు పెట్టాడు. భవిష్యత్తులో అతనో మంచి వ్యక్తి అవుతాడని భావించాడు. కానీ 25 ఏళ్లు తిరిగి చూస్తే ఇప్పుడు ఆ తాత పెట్టిన పేరే మనవడికి మోయలేనంత భారమైపోయింది. అతని పేరు చెప్తే చాలు భయపడుతున్నారు. ఇక, ఉద్యోగం ఎలా ఇస్తారు?.. ఇదే ఇప్పుడు జార్ఖండ్ జెంషెడ్‌పూర్‌కు చెందిన మేరిన్ ఇంజినీర్ సద్దాం హుస్సేన్ ఎదుర్కొంటున్న సమస్య. ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ పేరే తనకు ఉండటంతోనే అతనికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. కరుడుగట్టిన నియంతగా ప్రజలపై అనేక అకృత్యాలకు పాల్పడ్డట్టు ఆరోపిస్తూ 2003లో అమెరికా సద్దాంను గద్దె దింపిన సంగతి తెలిసిందే. 'సద్దాం అనే పేరు ఉండటంతో నాకు ఉద్యోగం ఇవ్వడానికి భయపడుతున్నారు' అని అతను వాపోతున్నారు. తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీలో మేరిన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సద్దాం.. ఇప్పటివరకు 40సార్లు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరైనా.. అనేక మల్టీనేషనల్ షిప్పింగ్ కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగినా.. అన్నిసార్లు చివరకు నిరాశే ఎదురైంది. అతని బ్యాచ్మేట్లు అంతా ప్రపంచమంతటా మంచి కొలువులు సంపాదించి.. జీవితంలో స్థిరపడిపోగా.. సద్దాం మాత్రం పేరు కారణంగా నిరుద్యోగిగా మిగిలిపోయాడు. సద్దాం అనే పేరు ఉండటం వల్ల వెంటనే అనుమానం వచ్చే అవకాశముందని, అందుకే అతనికి ఉద్యోగం ఇవ్వడానికి టాప్ కంపెనీలు నిరాకరిస్తున్నాయని ఢిల్లీకి చెందిన రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ అభిప్రాయపడింది. ఈ కష్టాల నేపథ్యంలో సద్దాం ఇప్పుడు తన పేరును సాజిద్‌గా మార్చాలని, ఈ మేరకు తన పదో తరగతి ధ్రువపత్రాలలో మార్పులు చేసేందుకు సీబీఎస్ఈకి ఆదేశాలు ఇవ్వాలంటూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన తాత ప్రేమతో పెట్టిన పేరే ఇప్పుడు తనకు పీడకలను మిగిల్చిందని, కేవలం పేరు కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని సద్దాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


