
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ సంస్థ, కేంద్రానికి రూ. 3,248 కోట్ల తుది డివిడెండును అందించింది. కంపెనీ సీఎండీ, డైరెక్టర్లు కలిసి ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్‌కి పేమెంట్ అడ్వైజ్‌ను అందజేశారు.
ఇప్పటికే ఇచ్చిన రూ. 2,424 కోట్ల తాత్కాలిక తొలి డివిడెండు, రూ. 2,424 కోట్ల రెండో తాత్కాలిక డివిడెండుకు ఇది అదనమని కంపెనీ తెలిపింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 8.35 చొప్పున మొత్తం రూ. 8,096 కోట్ల డివిడెండ్ ఇచ్చినట్లయిందని వివరించింది. అలాగే వరుసగా 32వ ఏడాది కూడా చెల్లించినట్లయిందని పేర్కొంది.