
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా.. సుమారు 3,31,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ మోటారులో లోపం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
స్టార్టర్లలోని లోపం కారణంగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించడానికి రీకాల్ అవసరమని బీఎండబ్ల్యూ ఇంజనీర్లు చెబుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే కంపెనీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాగా లోపభూయిష్ట బ్రేకింగ్ వ్యవస్థల కారణంగా గత సంవత్సరం కూడా కంపెనీ ఇలాంటి రీకాల్ జారీ చేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: భారత్‌లో స్వీడిష్ బ్రాండ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
ఈ సమస్య 2015 నుంచి 2021 మధ్య తయారైన బీఎండబ్ల్యూ చాలా మోడల్స్‌లో తలెత్తింది. తత్పలితంగా కంపెనీ అమెరికాలో 1,95,000 వాహనాలను, జర్మనీలో మరో 1,36,000 వాహనాలను మరమ్మతు చేయాల్సి ఉంది. అయితే ఈ సమస్య ఇండియాలోని కార్లలో కూడా తెలెత్తుతుందా? లేదా అనేది అధికారికంగా వెలువడలేదు. అయితే కంపెనీ ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరిస్తుంది.