
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo).. ఇండియన్ మార్కెట్లో ఈఎక్స్30 (EX30) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 41 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును అక్టోబర్ 19 కంటే ముందుగా బుక్ చేసుకున్నవారికి కంపెనీ దీనిని రూ. 39.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకే అందిస్తుంది.
కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారు.. క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్, రియర్ లైట్స్ వంటి వాటితో పాటు.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఏరోడైనమిక్ వీల్స్ వంటివి పొందుతుంది. ఛార్జింగ్ పోర్ట్ వెనుక ఎడమ క్వార్టర్ ప్యానెల్‌పై ఉంది.
మంచి ఇంటీరియర్ డిజైన్ కలిగిన ఈ కారు.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో పాటు గూగుల్ బేస్డ్ సిస్టమ్‌తో పనిచేసే 12.3-ఇంచెస్ వర్టికల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను పొందుతుంది. డాష్‌బోర్డ్ స్ట్రీమ్‌లైన్డ్ డ్రైవర్ ఇంటర్‌ఫేస్, స్టీరింగ్ వీల్ కోసం కొత్త డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల వంటి ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.
ఇదీ చదవండి: తగ్గిన ధరలు: కొత్త రేట్లు ప్రకటించిన టీవీఎస్
భారతీయ మార్కెట్ కోసం లాంచ్ అయిన కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారులో 69 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌పై 480 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 272 హార్స్ పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం కాగా.. ఇది 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.