హోండా రీకాల్: ఈ బైకులపై ఎఫెక్ట్ | Honda CB1000 Hornet SP Recalled In India Automobile | Sakshi
Sakshi News home page

హోండా రీకాల్: ఈ బైకులపై ఎఫెక్ట్

Nov 14 2025 2:43 PM | Updated on Nov 14 2025 3:07 PM

Honda CB1000 Hornet SP Recalled In India Automobile

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లోని బిగ్‌వింగ్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే ప్రీమియం CB1000 హార్నెట్ SP కోసం రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది?, సమస్య ఏమిటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఎగ్జాస్ట్ నుంచి వచ్చే వేడి వల్ల సీటు ఉపరితలం మృదువుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో పెడల్ పివోట్ వదులయ్యే అవకాశం ఉందని హోండా చెబుతోంది. ఈ వేడి కారణంగా గేర్ బోల్ట్ వదులైతే.. అది రైడింగ్ చేస్తున్నప్పుడు పడిపోవచ్చు. తద్వారా గేర్‌లను మార్చేటప్పుడు సమస్య తలెత్తుతుందని కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది.

జనవరి 2026 నుంచి సర్వీస్
ఈ సమస్యను పరిష్కరించడానికి.. మోటార్ సైకిల్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా, ప్రభావిత భాగాలను కంపెనీ ఉచితంగా చెక్ చేసి భర్తీ చేస్తుంది. రీకాల్ సర్వీస్ జనవరి 2026 నుంచి భారతదేశం అంతటా ఉన్న హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమవుతుంది.

హోండా మోటార్‌సైకిల్.. దాని బిగ్‌వింగ్ డీలర్‌లతో కలిసి కస్టమర్లకు ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ & ఈమెయిల్స్ ద్వారా రీకాల్ గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా బైక్ ఓనర్స్ అధికారిక హోండా వెబ్‌సైట్‌లో వారి వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా  రీకాల్ సమాచారం తెలుసుకోవచ్చు. సర్వీస్ సెంటర్లలో ఆలస్యం కాకుండా ఉండటానికి కస్టమర్‌లు అపాయింట్‌మెంట్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.

ఇదీ చదవండి: ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!

హోండా CB1000 హార్నెట్ SP బైక్ 999cc ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ ద్వారా 155 bhp & 107 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, మెరుగైన పనితీరు కోసం ఐదు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement