
2022లో యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన 'హోండా ఏడీవీ 350' (Honda ADV 350) స్కూటర్.. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో కనిపించింది. ఇది కొత్త కాస్మొటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. కానీ మెకానికల్, టెక్నికల్ అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాగా ఇది మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది.
సరికొత్త హోండా ఏడీవీ 350 స్కూటర్.. 330 సీసీ ఎస్ఓహెచ్సీ ఫోర్ వాల్వ్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్, 31.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. 11.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాక్స్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్.. ముందు భాగంలో 256 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ పొందుతుంది.
ఇదీ చదవండి: సరికొత్త బ్రిక్స్‌టన్ బైక్: దీని గురించి తెలుసా?
ఫీచర్స్ విషయానికి వస్తే హోండా ఏడీవీ 350 స్కూటర్.. ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్‌లు, హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్, ఫోర్ వే టోగుల్ స్విచ్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లైట్, ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్‌లు మొదలైనవి పొందుతుంది. అయితే ఈ స్కూటర్‌ను కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు.