
బ్రిక్స్‌టన్ మోటార్ సైకిల్స్.. తన మొట్టమొదటి మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయిన 'స్టోర్ 500'(Storr 500)ను ఆస్ట్రియాలోని తన ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత డెలివరీ ఎప్పుడనే విషయాన్ని సంస్థ వెల్లడించనుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి.. ముందుగా డెలివరీలు జరుగుతాయని సంస్థ వెల్లడించింది.
బ్రిక్స్‌టన్ స్టోర్ 500 బైక్.. 486 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా 8500 ఆర్పీఎం వద్ద 47.6 బీహెచ్పీ పవర్, 6750 ఆర్పీఎం వద్ద, 43 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, సెంట్రల్ రియర్ మోనోషాక్ వంటి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో డిస్క్ బ్రేక్‌లు ఈ బైకులో ఉంటాయి.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
ఫీచర్స్ విషయానికి వస్తే.. కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎల్ఈడీ డీఆర్ఎల్ & ఇండికేటర్స్, ఇంటర్నల్ ఫాగ్ ల్యాంప్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఈ బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైకుని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా?, లేదా అనేది వెల్లడించలేదు.