breaking news
German cars
-
భారీ రీకాల్: 3.3 లక్షల బీఎండబ్ల్యూ కార్లు వెనక్కి!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా.. సుమారు 3,31,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ మోటారులో లోపం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.స్టార్టర్లలోని లోపం కారణంగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించడానికి రీకాల్ అవసరమని బీఎండబ్ల్యూ ఇంజనీర్లు చెబుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే కంపెనీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాగా లోపభూయిష్ట బ్రేకింగ్ వ్యవస్థల కారణంగా గత సంవత్సరం కూడా కంపెనీ ఇలాంటి రీకాల్ జారీ చేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: భారత్‌లో స్వీడిష్ బ్రాండ్ కారు లాంచ్: ధర ఎంతంటే?ఈ సమస్య 2015 నుంచి 2021 మధ్య తయారైన బీఎండబ్ల్యూ చాలా మోడల్స్‌లో తలెత్తింది. తత్పలితంగా కంపెనీ అమెరికాలో 1,95,000 వాహనాలను, జర్మనీలో మరో 1,36,000 వాహనాలను మరమ్మతు చేయాల్సి ఉంది. అయితే ఈ సమస్య ఇండియాలోని కార్లలో కూడా తెలెత్తుతుందా? లేదా అనేది అధికారికంగా వెలువడలేదు. అయితే కంపెనీ ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్
- ధర రూ. 5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షల(ఎక్స్ షోరూమ్, ముంబై) రేంజ్లో ఉందని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా డెరైక్టర్(ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్) మైఖేల్ మేయర్ చెప్పారు. క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అవుట్సోడ్ రియర్ వ్యూ మిర్రర్స్(ఓఆర్వీఎం) వంటి కొత్త ఫీచర్లను ఈ కొత్త పోలో వేరియంట్లో అందిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.


