ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్ | New variant of the Volkswagen Polo | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్

Sep 8 2015 1:59 AM | Updated on Sep 3 2017 8:56 AM

ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్

ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త వేరియంట్

జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది...

- ధర రూ. 5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షలు
న్యూఢిల్లీ:
జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.5.24 లక్షల నుంచి రూ. 8.42 లక్షల(ఎక్స్ షోరూమ్, ముంబై) రేంజ్‌లో ఉందని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా డెరైక్టర్(ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్) మైఖేల్ మేయర్ చెప్పారు.  క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అవుట్‌సోడ్ రియర్ వ్యూ మిర్రర్స్(ఓఆర్‌వీఎం) వంటి కొత్త ఫీచర్లను ఈ కొత్త పోలో వేరియంట్‌లో అందిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement