కేపీఐ గ్రీన్‌కు ఎస్‌బీఐ నిధులు.. రూ. 3,200 కోట్లకు ఓకే | KPI Green Energy Secures Rs 3200 Crore SBI Sanction | Sakshi
Sakshi News home page

కేపీఐ గ్రీన్‌కు ఎస్‌బీఐ నిధులు.. రూ. 3,200 కోట్లకు ఓకే

Sep 28 2025 12:48 PM | Updated on Sep 28 2025 1:30 PM

KPI Green Energy Secures Rs 3200 Crore SBI Sanction

పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి ఫైనాన్స్‌ సౌకర్యాన్ని పొందినట్లు పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ తాజాగా వెల్లడించింది. దీంతో ఎస్‌బీఐ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. సోలార్, హైబ్రిడ్‌ ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్‌ ప్రాజెక్టులకు ఎస్‌బీఐ రుణాలు సమకూర్చనున్నట్లు తెలియజేసింది.

వీటిని గుజరాత్‌లో మొత్తం 1జీడబ్ల్యూపీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. రెండు వ్యూహాత్మక పాజెక్టులకు ఈ రుణ సౌకర్యాలు మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. 250 మెగావాట్ల(ఏసీ), 350 ఎండబ్ల్యూపీ(డీసీ) సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుతోపాటు.. 370 మెగావాట్ల హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్టు వీటిలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement