kp
-
కేపీఐటీ కంపెనీ చైర్మన్ రవి పండిట్ కన్నుమూత
ప్రముఖ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ ఎస్బీ రవి పండిట్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆటోమోటివ్ ఇంజినీరింగ్ పరిష్కారాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేపీఐటీ టెక్నాలజీస్‌ను స్థాపించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రవి పండిట్ కీలక పాత్ర పోషించారు.మూడు దశాబ్దాలకుపైగా వ్యాపార, సాంకేతిక రంగాల్లో సేవలందించిన రవి పండిట్ పుణె కేంద్రంగా కేపీఐటీ టెక్నాలజీస్‌ను ప్రారంభించి, సంస్థ కార్యకలాపాలను 15 దేశాలకు విస్తరించారు. అలాగే 1,200 మందికిపైగా నిపుణులతో పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ కీర్తానే అండ్ పండిట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (KPCA) కు కూడా ఆయన నాయకత్వం వహించారు.సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికీ ఆయన విశేషంగా కృషి చేశారు. పుణె ఇంటర్నేషనల్ సెంటర్, జన్వానీ సంస్థలకు సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన, గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కు మార్గనిర్దేశం చేశారు. జ్ఞాన ప్రబోధిని సంస్థ అధ్యక్షుడిగా యువ నాయకత్వ వికాసానికి తోడ్పడ్డారు.రవి పండిట్ అమెరికాలోని ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి. బంగారు పతక విజేత చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా కూడా సేవలందించారు. అంతేకాదు.. రచయితగానూ రవి పండిట్ గుర్తింపు పొందారు. పురస్కారం పొందిన ‘లీప్‌ఫ్రాగింగ్ టు పోల్-వాల్టింగ్’ అనే గ్రంథానికి ఆయన సహ రచయితగా వ్యవహరించారు. -
కేపీఐ గ్రీన్‌కు ఎస్బీఐ నిధులు.. రూ. 3,200 కోట్లకు ఓకే
పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి ఫైనాన్స్ సౌకర్యాన్ని పొందినట్లు పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ తాజాగా వెల్లడించింది. దీంతో ఎస్బీఐ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. సోలార్, హైబ్రిడ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ ప్రాజెక్టులకు ఎస్బీఐ రుణాలు సమకూర్చనున్నట్లు తెలియజేసింది.వీటిని గుజరాత్లో మొత్తం 1జీడబ్ల్యూపీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. రెండు వ్యూహాత్మక పాజెక్టులకు ఈ రుణ సౌకర్యాలు మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. 250 మెగావాట్ల(ఏసీ), 350 ఎండబ్ల్యూపీ(డీసీ) సోలార్ పవర్ ప్రాజెక్టుతోపాటు.. 370 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు వీటిలో ఉన్నాయి. -
కేపీ.. క్లీన్ స్వీప్
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స, ఇండస్ట్రీ ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి వెలువడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కటకం పెంటయ్య ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికి ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన దిడ్డి కుమారస్వామిపై కటకం పెంటయ్య విజయం సాధించగా, ఆయన ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారే కాకుండా ఐదుగురు కార్యవర్గ సభ్యులు గెలిచారు. ఫలితాలు వెలువడగానే పెంటయ్య వర్గీయులు చాంబర్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. - వరంగల్ సిటీ


