
పోటీ ప్రపంచంలో ముందుండాలని అందరూ కోరుకుంటారు. ఓ కంపెనీ తన పోటీ సంస్థకంటే మెరుగ్గా పని చేయాలని కోరుకుంటుంది. అందులో భాగంగా ఉద్యోగులకు ఇస్తున్న లక్ష్యాలను, ఒత్తిడిని పెంచుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తూ, రెవెన్యూ మిగిల్చుకుంటూ ఉన్నవారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. దాంతో కొందరు ఉద్యోగులు భారీగా వేతనాలు పుచ్చుకుంటున్నా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈమేరకు ఓ ఉద్యోగి రెడ్డిట్(Reddit)లో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నా వయసు 34. ఓ టాప్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer)గా పని చేస్తున్నాను. సంవత్సరానికి రూ.40 లక్షల సంపాదిస్తున్నాను. కానీ వర్క్‌కు సంబంధించి మానసికంగా చాలా అలసిపోతున్నాను. పని మొదలు పెట్టాలంటే ఏడుపు వస్తుంది. కంపెనీలో పని ఒత్తడి అధికంగా ఉంది. కెరియర్‌లో కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను. సలహా ఇవ్వగలరు’ అని రాసుకొచ్చారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..‘మీ కంపెనీ అందించిన సెలవులను ఉపయోగించి తాత్కాలిక విరామం తీసుకోండి’ అని ఒకరు తెలిపారు. ‘తిరిగి వేరే కంపెనీల్లో ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. నాన్ టెక్ రోల్స్, స్టార్టప్‌లు, లేదా ఫ్రీలాన్సింగ్ వైపు చూడవచ్చు’ అని మరొకరు చెప్పారు. మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ తీసుకోండంటూ ఇంకొకరు రిప్లై ఇచ్చారు. టెక్ నిపుణుల్లో పని ధోరణి మారుతుంది. కొంత మంది టెక్కీలు ఇప్పుడు కంపెనీలు ఆఫర్ చేస్తున్న వేతనాల కంటే వర్క్-లైఫ్ సమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారని స్పష్టం అవుతుంది.
ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..