
డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు షాపుకు వెళ్లి కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. కొత్తిమీర దగ్గర నుంచి బంగారం వరకు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో కొన్ని సార్లు మోసపోతున్నారు. పెట్టే ఆర్డర్ ఒకటైతే.. వచ్చే డెలివరీ ఇంకొకటి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''వెండి కాయిన్స్ ఆర్డర్ చేశాను. కానీ నాకు మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. అంతే కాకుండా నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది. దానికి సీల్ చేసి ఉంది. డెలివరీ భాగస్వామి ఆ సీల్ ఓపెన్ చేయలేనని అన్నారు. మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి.. అని డెలివరీ బాయ్ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. 40 నిమిషాల తరువాత నేను పౌచ్ ఓపెన్ చేసాను. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. కానీ 999 ప్యూర్ సిల్వర్ కాదు. అవి 925 స్టెర్లింగ్ సిల్వర్'' అని వినీత్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో స్విగ్గీ హర్రర్ స్టోరీ అని పోస్ట్ చేశారు.
Update, 2nd order now delivered
Except 2 coins, everything else is 999.@SwiggyInstamart - help me with the 2 coins which were 925 🪙 https://t.co/bieocsn6C9— Vineeth K (@DealsDhamaka) September 27, 2025
నాకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్‌నే తీసుకోమన్నాను. నేను వాటిని ఆర్డర్ చేయలేదు. కాబట్టి అవి నాకు వద్దని వినీత్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది.
వినీత్ మరో ట్వీట్ చేస్తూ.. ఈ సారి స్విగ్గీ నాకు స్వచ్ఛమైన వెండి నాణేలను డెలివరీ చేసిందని, దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఆర్డర్ ఐడీని షేర్ చేయమని స్విగ్గీ కోరింది. వినీత్ తన ఆర్డర్ ఐడీ షేర్ చేశారు. సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు.. కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారుకు ధన్యవాదాలు తెలిపింది.
Thank you for bringing this to our attention and for the details, Vineeth. We would like to run a quick check. Please bear with us.
^Sneha B— Swiggy Cares (@SwiggyCares) September 27, 2025