
మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ (Eric Schmidt).. రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ మీద మరోసారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్క్ ఆమోదయోగ్యం అయినప్పటికీ.. సాంకేతిక రంగంలో ఇది కుదరదు. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి
వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అనేది ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. కొత్తగా నేర్చుకునే తత్వాన్ని నాశనం చేస్తుంది. ఆఫీసులో సహోద్యుగుల నుంచి చాలావరకు నేర్చుకోవచ్చు. కాబట్టి నేను 'వర్క్ ఫ్రమ్ హోమ్'ను సమర్ధించనని ఎరిక్ స్మిత్.. ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.
గత ఏడాది కంపెనీ రిమోట్ వర్క్ కల్చర్ కారణంగా.. చిన్న ఏఐ స్టార్టప్‌ల కంటే వెనుకబడిందని స్మిత్ అన్నారు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. నా కెరీర్ తొలినాళ్లలో సన్ మైక్రోసిస్టమ్స్‌లోని సహోద్యోగులు వాదించడాన్ని వినడం ద్వారా చాలా నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో అందమైన నగరం: ఇన్‌స్టాలో ఇదే టాప్..
అమెరికా, చైనా టెక్ పరిశ్రమ పోటీలను స్మిత్ హైలైట్ చేశారు. ఇక్కడ 996 పని సంస్కృతి ఉందని అన్నారు. ఈ దేశాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నారు. చైనాలో ఇటువంటి అధిక పని గంటలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు.. ఉద్యోగులు ఇప్పటికీ ఈ కఠినమైన షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నారని, ఇది యూఎస్ వ్యాపారాలకు గణనీయమైన పోటీ ఒత్తిడిని సృష్టిస్తుందని ఎరిక్ ష్మిత్ పేర్కొన్నారు.