
స్మార్ట్‌ఫోన్ వచ్చిన తరువాత.. అందమైన ప్రదేశం కనిపించగానే ఫోటో తీసేస్తారు. అంతటితో ఊరుకుంటారా?, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం చూస్తారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో తీసి పోస్ట్ చేయడానికి అనువైన ఆకర్షణీయమైన నగరాల జాబితాను ఆర్ట్ అండ్ డిజైన్ ఇంప్రెంట్ అయిన రివర్స్ వాల్ ఆర్ట్ ఒక నివేదికలో విడుదల చేసింది.
రివర్స్ వాల్ ఆర్ట్ డేటా ప్రకారం.. అమెరికాలో అత్యంత అందమైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలోని 25 అతిపెద్ద నగరాల్లో 895 మిలియన్లకు పైగా హ్యాష్‌ట్యాగ్‌లను విశ్లేషించిన తరువాత నిపుణులు నివేదిక విడుదల చేసారు. న్యూయార్క్ ఒక సాంస్కృతిక చిహ్నం. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. యాన్యువల్ రాక్‌ఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ నుంచి ఎంపైర్ స్టేట్ భవనం వరకు.. ఈ నగరంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లలో #NYC (145.3 మిలియన్), #NewYorkCity (35.9 మిలియన్స్) ఉన్నాయి. మొత్తం మీద న్యూయార్క్ హ్యాష్‌ట్యాగ్‌లతో 183,869,262 పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత అందమైన నగరం మాత్రమే కాదు.. అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా.
ఇన్‌స్టాగ్రామ్‌లో అధికంగా పోస్ట్ చేసిన అమెరికాలోని నగరాలు
●న్యూయార్క్: 18,38,69,262 పోస్ట్‌లు
●లాస్ ఏంజిల్స్: 141,271,982 పోస్ట్‌లు
●చికాగో: 60,196,138 పోస్ట్‌లు
●లాస్ వెగాస్: 54,038,732 పోస్ట్‌లు
●శాన్ ఫ్రాన్సిస్కో: 45,895,134 పోస్ట్‌లు
●వాషింగ్టన్: 45,470,821 పోస్ట్‌లు
●శాన్ డియాగో: 39,451,127 పోస్ట్‌లు
●సియాటిల్: 37,597,785 పోస్ట్‌లు
●ఆస్టిన్: 34,022,105 పోస్ట్‌లు
●హూస్టన్: 33,942,790 పోస్ట్‌లు
ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్