
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం జీ20 కూటమి దేశాల్లో చూస్తే.. భారత్‌లోనే నిరుద్యోగ రేటు అత్యంత కనిష్టంగా 2 శాతం స్థాయిలో ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి 'మన్‌సుఖ్ మాండవీయ' తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనలాంటి స్కీములు కూడా ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్ ద్వారా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు క్లాసిఫైడ్స్ ఆన్‌లైన్ సైట్ ‘క్వికర్’, డిజిటల్ మెంటార్‌షిప్ ప్లాట్‌ఫాం’ మెంటార్ టుగెదర్’తో కార్మిక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఈ భాగస్వామ్యాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'
మెంటార్ టుగెదర్ భాగస్వామ్యంతో తొలి ఏడాదిలో 2 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. మరోవైపు క్వికర్ జాబ్స్‌ని ఎన్‌సీఎస్‌కి అనుసంధానించడం వల్ల పోర్టల్‌కి ప్రతి రోజూ 1,200 జాబ్ లిస్టింగ్‌లు జతవుతాయని పేర్కొన్నారు. ఎన్‌సీఎస్ ప్లాట్‌ఫాంలో 52 లక్షల పైగా సంస్థలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం పోర్టల్‌లో 44 లక్షల పైచిలుకు వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి.
Opportunities. Guidance. Growth.
Today, @NCSIndia signed MoUs with @mentortogether and Quikr to enhance job access and career guidance for our Yuva Shakti. Through this, Mentor Together will offer expert mentorship and career guidance, while Quikr will bring 1,200+ daily job… pic.twitter.com/nFwWNSZcF2— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 8, 2025