
అమెరికా ఉద్యోగ మార్కెట్ పరిస్థితి గురించి.. ప్రముఖ ఆర్ధిక సంస్థ మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ 'మార్క్ జాండీ' ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ఉద్యోగుల భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్), ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ఎక్కువగా ఆధారపడుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితి ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని స్పష్టం చేశారు
ఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాలలో ఆరు లక్షల ఉద్యోగాలు పుట్టాయి. ఈ రెండు రంగాలు లేకపోతే.. ఇక్కడ ఉద్యోగాల సృష్టి సున్నాకు పడిపోయే అవకాశం ఉందని మార్క్ జాండీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఆర్థికమాంద్యం సమయంలోనే కనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అమెరికా ఉద్యోగ మార్కెట్ మాంద్యం ఎదుర్కొంటుందా?
అమెరికా ఉద్యోగ పరిస్థితి మాంద్యంలోకి ప్రవేశించినట్లు జాండీ ట్వీట్ చెబుతోంది. జూన్ నెలలో ఉద్యోగాలు తగ్గినప్పటికీ.. జులై, ఆగస్టు నెలలో స్వల్ప వృద్ధి ఉంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా?, తగ్గుతుందా?, అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. జీడీపీ, ఆదాయాలు కొంత పెరుగుతున్నప్పటికీ.. తయారీ, మైనింగ్, నిర్మాణం వంటి రంగాల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి మాంద్యం కాదని మార్క్ అన్నారు.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
యూఎస్ ఉద్యోగాల డేటా
యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) శుక్రవారం.. ఉద్యోగ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేటు ఆగస్టులో 4.3% ఉంది. జూలై 2025లో 79,000గా ఉన్న ఉద్యోగాల వృద్ధి.. ఆగస్టులో 22,000కు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అవగతం అవుతోంది.
What’s perhaps most disconcerting about the flagging job market is how dependent it is on healthcare and hospitality for what little job growth is occurring. Since the beginning of the year, the economy has created a paltry 600k jobs, but without the job growth in these… pic.twitter.com/lmheiipugG
— Mark Zandi (@Markzandi) September 7, 2025