విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్‌’ బానిసలుగా మార్చారు | offerd Jobs in abroad have been turned into cyber slaveries | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్‌’ బానిసలుగా మార్చారు

Apr 12 2025 3:52 PM | Updated on Apr 12 2025 4:01 PM

offerd Jobs in abroad have been turned into cyber slaveries

విదేశాల్లో ఉద్యోగాలంటూ సోషల్‌ మీడియాలో నకిలీ జాబ్‌ ఏజెన్సీ ప్రకటన 

నమ్మి వచ్చిన అమాయకులను టూరిస్ట్‌ వీసాపై థాయ్‌లాండ్, మయన్మార్‌కు 

వారితో బలవంతంగా డిజిటల్‌ స్కామ్‌లు, సైబర్‌ నేరాలు చేయించిన వైనం 

60 మందిని కాపాడిన రాష్ట్ర సైబర్‌ పోలీసు విభాగం.. ఐదుగురి అరెస్టు  

ముంబై: మయన్మార్‌లో సైబర్‌ బానిసలుగా బతుకీడుస్తున్న 60 మందికి పైగా భారతీయులను మహారాష్ట్ర పోలీసుల సైబర్‌ విభాగం రక్షించింది. ఒక విదేశీ పౌరుడు సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు... థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగావకాశాలున్నాయంటూ మొదట సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా ఓ ముఠా ప్రకటనలిచ్చిందిది. 

ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు అమాయకులను సదరు ముఠా ఏజెంట్లు పాస్‌పోర్టులు, విమాన టికెట్లు ఏర్పాటుచేసి పర్యాటక వీసాలపై థాయ్‌లాండ్‌కు, అక్కడినుంచి మయన్మార్‌ సరిహద్దుకు పంపారు. ఆ తరువాత చిన్న పడవల్లో వారిని నది దాటించి సాయుధ తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రదేశాల్లో దింపారు. అక్కడ వారితో బలవంతంగా చీడిజిటల్‌ అరెస్ట్‌’ స్కామ్‌ల నుంచి నకిలీ పెట్టుబడి పథకాల దాకా అనేక సైబర్‌ మోసాలు చేయించారు. దీనిపై సమాచారమందుకున్న మహారాష్ట్ర సైబర్‌ పోలీసు విభాగం , ఇతర ఏజెన్సీలతో కలిసి బాధితులను రక్షించింది. త్వరలోనే వీరిని స్వదేశానికి తీసుకురానున్నారు. 

చదవండి: సింగపూర్‌ ‘ట్రీ టాప్‌వాక్‌’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు

మనీష్‌ గ్రే సహా నలుగురి అరెస్టు  
రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీష్‌ గ్రే అలియాస్‌ మాడీ, తైసన్‌ అలియాస్‌ ఆదిత్య రవి చంద్రన్, రూపనారాయణ్‌ రాంధర్‌ గుప్తా, జెన్సీ రాణి డి మరియు చైనీస్‌–కజకిస్తానీ జాతీయుడు తలానిటి నులాక్సీలను అరెస్టు చేసింది. వీరిలో మనీష్‌ గ్రే పలు వెబ్‌ సిరీస్‌లు టెలివిజన్‌ షోలలో నటించిన ప్రొఫెషనల్‌ నటుడు అని కొంతమంది వ్యక్తులను నియమించుకుని మయన్మార్‌కు మనుషులను అక్రమ రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. తలానిటి నులాక్సీ భారతదేశంలో సైబర్‌ నేరాలకు పాల్పడేలా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తు కొనసా గుతోందని పేర్కొన్నారు.       

ఇదీ చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో?



 

Advertisement
 
Advertisement
Advertisement