
ఎక్కడైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే రాత పరీక్షలు & ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. కానీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకే ఉద్యోగం అంటూ.. మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో ఫౌండర్, సీఈఓ 'విరాజ్ శేత్' పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విరాజ్ శేత్ ఇటీవలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో "డూమ్-స్క్రోలర్" కోసం, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థి రోజుకు కనీసం ఆరు గంటలు ఇన్‌స్టా, యూట్యూబ్‌లో స్క్రోలింగ్ చేస్తుండాలి. (డూమ్-స్క్రోలర్లు అంటే.. ఫోన్ స్క్రీన్ స్కోల్ చేస్తూ ఉండేవారు).

నైపుణ్యాల విషయానికి వస్తే.. హిందీ, ఇంగ్లీష్ భాషలలో పట్టు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై మంచి పట్టును కలిగి ఉండాలి. క్రియేటర్ కల్చర్ మీద ఆసక్తి ఉండాలని విరాజ్ శేత్ వెల్లడించారు. ఎక్సెల్ ఉపయోగించడం కూడా బాగా తెలుసుండాలని చెప్పారు. ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం ముంబై అని, ఇది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాలో ఎక్కువ టైమ్ కేటాయించేవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం చెడు వ్యసనం కాదని మా అమ్మతో చెబుతాను, అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు నేను 19 గంటలు సమయం కేటాయిస్తాను, ఇది సరిపోతుందా అని అన్నారు.