
వాచీల తయారీ దిగ్గజం టైటాన్ తాజాగా స్టెల్లార్ 3.0 కలెక్షన్ కింద 9 టైమ్‌పీస్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. వీటిలో మూడు లిమిటెడ్ ఎడిషన్ వాచీలు ఉన్నాయి. టైటానియంలో అమర్చిన రెండు శాటిలైట్ డిస్కులతో రూపొందించిన వ్యాండరింగ్ హవర్స్ వాచ్ ధర రూ. 1,79,995గా ఉంటుందని సంస్థ తెలిపింది.
ఇవి కేవలం 500 పీస్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఉల్క శకలంతో రూపొందించిన ఐస్ మెటియోరైట్ వాచీ ధర రూ.1,39,995గా, నార్తర్న్ లైట్స్‌ని తలపించే ఆరోరా సెలమ్ ధర రూ. 95,995గా ఉంటుందని సంస్థ సీఈవో (వాచెస్ అండ్ వేరబుల్స్) కురువిల్లా మార్కోస్ తెలిపారు.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!