
ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకులో మెజారిటీ వాటాలను దక్కించుకోవడంపై ఎమిరేట్స్ ఎన్‌బీడీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది నెలలుగా దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని, 51 శాతం వాటాను కొనుగోలు చేయడంపై ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఆసక్తిగా ఉందని వివరించాయి. అయితే, ఇంకా డీల్ నిబంధనలేమీ ఖరారు కాలేదని, ఈ చర్చలు ఫలవంతమవుతాయా లేదా అనేది చెప్పలేమని పేర్కొన్నాయి.
ప్రమోటర్లెవరూ లేకపోవడంతో ఆర్‌బీఎల్‌లో 100 శాతం వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్ల వద్దే ఉన్నాయి. 1963లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్‌గా ప్రారంభమైన ఎమిరేట్స్ ఎన్‌బీడీ ప్రస్తుతం భారత్‌లో చెన్నై, గురుగ్రామ్, ముంబై శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 17,786.79 లక్షల కోట్లుగా ఉంది. దీని బట్టి చూస్తే 51 శాతం వాటాల విలువ సుమారు రూ. 9,071 కోట్లుగా ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!