
లాస్ట్–మైల్ డెలివరీ సేవలను మెరుగుపర్చుకోవడంలో, మౌలిక సదుపాయాల సంబంధ సాధనాలను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందించేలా కేంద్రం కీలక చర్య తీసుకుంది. ప్రైవేట్ రంగానికి కూడా పీఎం గతి శక్తి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూనిఫైడ్ జియోస్పేషియల్ ఇంటర్‌ఫేస్ (యూజీఐ) ద్వారా ‘పీఎం గతిశక్తి పబ్లిక్’ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆవిష్కరించారు.
ఇది విజయవంతంగా ఉపయోగపడుతున్న సందర్భాలను, ఉత్తమ వినియోగ విధానాలను వివరించే పీఎం గతిశక్తి కాంపెన్డియమ్ మొదలైన వాటిని కూడా ఆయన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల ప్రణాళికలు వేసుకునేందుకు, పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్‌ఎంపీ (నేషనల్ మాస్టర్ ప్లాన్)లోని నిర్దిష్ట డేటా ఈ వెబ్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రైవేట్ సంస్థలు, కన్సల్టెంట్లు, పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. మౌలిక సదుపాయాల అసెట్స్‌కి సంబంధించిన 230 డేటా సెట్స్ వివరాలను పొందేందుకు, సైట్ యోగ్యతను విశ్లేషించుకునేందుకు, కనెక్టివిటీ.. అలైన్‌మెంట్ ప్లానింగ్ మొదలైన వాటికి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!