రూ.5.5 లక్షల నుంచి.. ఏడాదికే రూ.45 లక్షలు: టెకీ ట్వీట్ | Delhi Techie Claims Rs 5 5 Lakh Package Jumped To Rs 45 Lakh In A Year Tweet Viral | Sakshi
Sakshi News home page

రూ.5.5 లక్షల నుంచి.. ఏడాదికే రూ.45 లక్షలు: టెకీ ట్వీట్

May 27 2025 7:10 PM | Updated on May 27 2025 7:40 PM

Delhi Techie Claims Rs 5 5 Lakh Package Jumped To Rs 45 Lakh In A Year Tweet Viral

సాధారణంగా ఉద్యోగంలో చేరితే.. ప్రతిఏటా 10 శాతం లేదా 20 శాతం శాలరీ హైక్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో హైక్ అనేమాట చాలా అరుదుగా వినిపిస్తుంది. కానీ ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక ఏడాదిలోనే కనీవినీ ఎరుగని ఆఫర్ పొందినట్లు. తన జీతం కూడా దాదాపు 10 రెట్లు  పెరిగినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ క్కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన కెరీర్ ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే తన జీతం.. రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు చేరిందని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేవేష్ అనే టెక్నీషియన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను ఐబీఎంలో రూ. 5.5 లక్షల సీటీసీకి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ. 45 లక్షల ఆఫర్ ఉందని చెప్పాడు. నాలాంటి మధ్యతరగతి వ్యక్తికి, ఇది ఇప్పటికీ ఒక కల అని చెప్పుకొచ్చాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కొందరు అతన్ని ప్రశంసించారు, మరొకొందరు తమ అనుమానాలను వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేల

కెరీర్ ప్రారంభంలో జీతం కంటే నైపుణ్యాలపై ద్రుష్టి పెట్టాలి. అలాంటప్పుడే మీకు మంచి ప్యాకేజీ లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా దిగులు పడొద్దు, ఎందుకంటే మీ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతే తప్పకుండా మంచి ఆఫర్స్ వస్తాయని టెకీ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement