ఇంకెంత కాలం జాబ్‌ చేస్తారు.. ఇకనైనా మారండి | Robert Kiyosaki said lotof layoffs in future prepare for that | Sakshi
Sakshi News home page

ఇంకెంత కాలం జాబ్‌ చేస్తారు.. ఇకనైనా మారండి

Apr 19 2025 1:55 PM | Updated on Apr 19 2025 2:41 PM

Robert Kiyosaki said lotof layoffs in future prepare for that

రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోత కొనసాగుతుందని ప్రముఖ రచయిత, ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. సాంప్రదాయంగా ఉద్యోగంపై ఆధారపడటాన్ని పున:పరిశీలించాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో కొన్ని వివరాలు పంచుకున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటికే చెలరేగుతున్న ఆర్థిక అస్థిరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, లక్షల మందిని ఇది ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు.

‘గత రెండేళ్లుగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. రాబోయే కొన్నేళ్లలో మరిన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. కొలువు పోతుందని భావిస్తే అందుకు అనుగుణంగా మరింత ఉత్తమంగా సిద్ధం అవ్వాలి. ఉద్యోగ భద్రత కోసం ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ద్వారా ఆర్థిక స్వేచ్ఛ దిశగా అడుగులు వేయాలి. దాంతో ఆర్థికంగా ఎదురయ్యే ఎదురుదెబ్బలను అవకాశాలుగా మలుచుకోవాలి’ అని సూచించారు.

ఇదీ చదవండి: జాబ్‌ ఆఫర్‌ లేకుండానే యూఎస్‌లో పని

‘ఉపాధి కంటే ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మరింత స్థిరమైంది. వ్యక్తులు యజమానులపై ఆధారపడటం అనే ధోరణి నుంచి బయటకు రావాలి. ఇంకెతకాలం ఉద్యోగులుగా ఉంటారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. ఉద్యోగ భద్రత అనే భావం నుంచి బయటకు రండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఆచరణాత్మక మార్గం. ఇటువంటి వేదికలు ప్రజలు స్వతంత్రంగా విజయం సాధించడంలో సహాయపడటానికి అవసరమైన శిక్షణ ఇస్తాయి. నెట్‌వర్క్‌ మార్కెటింగ్ కంపెనీతో పార్ట్‌టైమ్‌ వ్యాపారాన్ని ప్రారంభించాలని అధ్యక్షుడు ట్రంప్, నేను సిఫార్సు చేస్తున్నాం. ప్రస్తుతం అనేక గొప్ప నెట్‌వర్క్‌ మార్కెటింగ్ సంస్థలు ఉన్నాయి’ అని కియోసాకి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement