జాబ్‌ ఆఫర్‌ లేకుండానే యూఎస్‌లో పని | Work in US without job offer know about special visas | Sakshi
Sakshi News home page

జాబ్‌ ఆఫర్‌ లేకుండానే యూఎస్‌లో పని

Apr 19 2025 1:10 PM | Updated on Apr 19 2025 1:19 PM

Work in US without job offer know about special visas

అమెరికా వెళ్లడం చాలామంది కల. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని నిపుణులకు యూఎస్‌ తమ​ కెరియర్ పురోగతికి అంతిమ గమ్యంగా తోస్తుంది. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, మెరుగైన వేతనాలు, శాశ్వత నివాసానికి అవకాశాలు ఉండటంతో అమెరికాలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే యూఎస్‌ వెళ్లేందుకు వర్కింగ్‌ వీసా పొందడం కష్టమే. దీనికి సాధారణంగా యూఎస్ కంపెనీ యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం అవుతుంది. కానీ జాబ్ ఆఫర్ లేకుండానే అమెరికాలో పని చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇందుకోసం కింది రెండు వీసాలు ఎంతో ఉపయోగపడుతాయి.

ఈబీ-2

ఈబీ-2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్‌ (ఎన్ఐడబ్ల్యూ) అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డ్) కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా అధునాతన డిగ్రీలు (మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ వంటివి) లేదా యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు.

ఈబీ-2కు ఎవరు అర్హులు?

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు దీనికి అర్హులు. యజమానిపై ఆధారపడే హెచ్ -1బీ మాదిరిగా కాకుండా ఈబీ-2 కోసం ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పనిచేయవచ్చు.

ఓ-1 వీసా

ఓ-1 వీసా అనేది ఒకే యజమాని నుంచి స్పాన్సర్‌షిప్‌ అవసరం లేని వీసా. ఇది అసాధారణ సామర్థ్యాలు ఉన్నవారికి ఇస్తారు. ఇది నిపుణులు విభిన్న సంస్థల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అనుమతిస్తుంది. ఆయా రంగాల్లో అసాధారణ సామర్థ్యాలున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.

ఇదీ చదవండి: బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్‌..?

సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీరి పేరుపై ఆయా రంగాల్లో రికార్టులుండాలి. ఆ విజయాలకు జాతీయ లేదా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఓ-1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement