
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి కంపెనీలను సైతం మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉద్యోగమే పోతే?, వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యమే. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం నుంచి తొలగించిన తమ బాధాకరమైన అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గుర్గావ్‌లోని ఒక చిన్న కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా రెండు సంవత్సరాలు పనిచేసానని.. ఈ ఏడాది జూలైలో సాకేత్‌లోని ఫుడ్ బేస్డ్ కంపెనీలో చేరాను పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండో రోజు.. ఆ కంపెనీ బాస్ మరిన్ని బాధ్యతలు చేపట్టగల మేనేజర్ చూస్తున్న కారణంగా.. నన్ను తొలగించారు. చేసేదేమీ లేక నేను ఆఫీసు నుంచి వెళ్ళిపోయాను.

ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నారు. ఇది మానసికంగా నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఇప్పుడు నా మునుపటి కంపెనీకి కూడా వెళ్లలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థానంలో కంపెనీ మరొకరిని నియమించుకుంది. ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదని, నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగారు.
ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలంటే.. చట్టపరమైన పరిణామాలు ఉండాలి?, మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు కాబట్టి.. మీరు న్యాయవాదిని సంప్రదించండి అని ఒకరు సలహా ఇచ్చారు. వేచి ఉండండి, తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని మరొకరు అన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉండండి, ఇంటర్యూలు విఫలమైనా బాధపడకండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు.