ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
న్యాయ రంగంలో విశిష్ట సేవలు, చారిత్రాత్మక తీర్పులు, న్యాయపరమైన నిబద్ధతతో మంచి పేరు సంపాదించిన ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలపై జరుగుతున్న నేరాలు, డ్రగ్స్, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సుమోటోగా స్వీకరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.
ఆమె పదవీకాలం న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా చరిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి అభినందనలు తెలిపారు ఒక సామాజిక కార్యకర్తగా తన బాధ్యత అని వ్యవస్థాపక అధ్యక్షులు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన తెలిపారు.


