అల్లరి పనులు చేసేవారిని ‘కోతి పనులు చేయకండి’ అని పెద్దలు విసుక్కోవడాన్ని చూస్తుంటాం. ఈ మందలింపుల సంగతేమిటోగానీ ‘కోతి పనులు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు ఇస్తోంది ఏఐ స్లాప్ యూట్యూబ్ చానల్ ‘బందర్ ఆ దోస్త్’ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో అసంబద్ధమైన చిన్న చిన్న వీడియోలను రూపోందిస్తుంటుంది బందర్ ఆప్నా దోస్త్. ఈ వీడియోలలో ప్రధాన రాత్ర ఒక కోతి.
ఈ వీడియోలలో మాట్లాడే భాష ఉండదు. అర్థమయ్యే కథ ఉండదు. అయితే ఆసక్తికరంగా ఉంటుంది. అదే దాని అసలు సిçసలు బలం. ఆ ఆసక్తే ‘బందర్ ఆప్నా దోస్త్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడేలా చేసింది.
ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేయడానికి భాష అవరోధం కాబోదు. ప్రపంచవ్యాప్తంగా ఏ భాష మాట్లాడే వారికైనా ఇట్టే అర్థమైపోతుంది.
వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ ‘కాష్వింగ్’ నిర్వహించిన సర్వేలో ‘బందర్ ఆప్నా దోస్త్’ సంవత్సరానికి సగటున 35 నుంచి 36 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. ప్రారంభమైన కొద్ది నెలల్లోనే ఈ ఛానల్ రెండు బిలియన్‌లకు పైగా వ్యూస్, సన్స్ స్క్రైబర్‌లను సాధించింది.
ఏఐతో రూపోందించిన కంటెంట్ కాబట్టి ప్రోడక్షన్ ఖర్చు శూన్యం. దీంతో వచ్చిన డబ్బంతా లాభమే!
ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఏఐ స్లాప్’ హవాకు ‘బందర్ ఆప్నా దోస్త్’ పెద్ద ఉదాహరణ. ఇలాంటి చానల్స్ ప్రపంచవ్యాప్తంగా 278 వరకు ఉన్నాయి. వీటికి దాదాపు 20 కోట్లమందికి పైగా సబ్‌స్రైబర్‌లు ఉన్నారు.


