
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నాకు మస్క్ కావాలి. మస్క్‌తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్‌ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్‌తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్‌ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది.
ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్‌లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.
అదిగో అప్పడే జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్‌లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.
ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్‌లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది.