
ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAIని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కంపెనీ దాని వ్యవస్థాపక లక్ష్యానికి పూర్తిగా ద్రోహం చేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా మస్క్ OpenAI ‘ఒక అబద్ధంపై నిర్మించబడింది. ఒక స్వచ్ఛంద సంస్థగా వెలసి సొంత ఆర్థిక లాభం కోసం పని చేస్తుంది’ అని పేర్కొన్నారు.
మస్క్ తాజా దాడి నేపథ్యం
OpenAI ఇటీవల తన వైరల్ టెక్స్ట్-టు-వీడియో అప్లికేషన్ ‘సోరా’ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనిపై వస్తున్న పోస్ట్‌లకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.
2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు.
ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు..