
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్‌మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్‌కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.
ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్‌లో ఎల్లిసన్‌కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.
ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..
ఓపెన్‌ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్‌డ్యాన్స్‌తో ఒప్పందాలు.
2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.
ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.
ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్‌తో ప్రత్యక్ష పోటీలో ఉంది.
పేరు | నెట్‌వర్త్ (సెప్టెంబర్ 2025) | సంస్థలు | ఇటీవలి పరిణామాలు |
---|---|---|---|
లారీ ఎలిసన్ | 393 బిలియన్ డాలర్లు | 41% ఒరాకిల్ | ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్‌ఏఐతో డీల్ |
ఎలాన్‌మస్క్ | 385 బిలియన్ డాలర్లు | టెస్లా, స్పేసెఎక్స్ | ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల |

ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు..