breaking news
Larry Ellison
-
ఆ ‘సింగిల్ మైండ్‌సెట్’ మస్క్ కంటే ధనవంతున్ని చేసింది!
బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.సెయిల్ బోట్ల రేసింగ్ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్‌పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.ఇదీ చదవండి: కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీLarry Ellison on success being directly correlated to questioning limits and conventional wisdom pic.twitter.com/gD87fTVxP8— prayingforexits 🏴☠️ (@mrexits) October 24, 2025 -
ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ సంచలనం..
-
ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన మొత్తం సంపద 373 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31 లక్షల కోట్లు). ఏఐ బూమ్ కారణంగా ఒరాకిల్ స్టాక్ విలువ భారీగా పెరగడంతో గత కొన్ని నెలల్లో ఎల్లిసన్ సంపద వేగంగా ఎగిసింది.లారీ ఎల్లిసన్ ( Larry Ellison) 2010లోనే గివింగ్ ప్లెడ్జ్ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన సంపదలో 95 శాతం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే సాంప్రదాయ సామాజిక సంస్థల ద్వారా కాకుండా తన సొంత నిబంధనలపై సంపదను ఇవ్వడానికి ఇష్టపడతానని చెబుతారు. అలాగే విరాళాలు ఇస్తూ వస్తున్నారు.విరాళం ఎలా ఇవ్వాలనుకుంటున్నారంటే..లారీ ఎల్లిసన్ తన సంపదను ఎలా ఇవ్వాలని యోచిస్తున్నాడో ఫార్చ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. ఎల్లిసన్ నెట్‌వర్త్ సెప్టెంబర్ 2025 నాటికి 373 బిలియన్ డాలర్లని అంచనా. టెస్లాలో గణనీయమైన పెట్టుబడితో పాటు ఒరాకిల్‌లో ఆయనకున్న 41 శాతం వాటా నుంచే ఆయన సంపదలో ఎక్కువ భాగం వచ్చింది.ఎల్లిసన్ తన దాతృత్వ కార్యక్రమాల్ని ప్రధానంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని సంస్థ ఎల్లిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EIT) ద్వారా కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆహార కొరత, వాతావరణ మార్పు, ఏఐ పరిశోధనతో సహా ప్రపంచ సవాళ్లపై ఈ సంస్థ దృష్టి పెడుతుంది. సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ కొత్త మెయిన్ క్యాంపస్ 2027 నాటికి ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ప్రారంభం కానుంది.కొన్నేళ్లుగా ఎల్లిసన్ అనేక భారీ స్థాయి విరాళాలు ఇచ్చారు. క్యాన్సర్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి 200 మిలియన్ డాలర్లు, ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్ కు సుమారు 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు.ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే.. -
ఎలన్ మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్
-
ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్‌మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్‌కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్‌లో ఎల్లిసన్‌కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్‌డ్యాన్స్‌తో ఒప్పందాలు.2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.ఎంటర్ప్రైజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్‌తో ప్రత్యక్ష పోటీలో ఉంది.పేరునెట్వర్త్ (సెప్టెంబర్ 2025)సంస్థలుఇటీవలి పరిణామాలులారీ ఎలిసన్393 బిలియన్ డాలర్లు41% ఒరాకిల్ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్ఏఐతో డీల్ఎలాన్మస్క్385 బిలియన్ డాలర్లుటెస్లా, స్పేసెఎక్స్ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు.. -
ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.ఎలాన్ మస్క్‌టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.లారీ ఎల్లిసన్ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.మార్క్ జుకర్బర్గ్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజెఫ్ బెజోస్వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.లారీ పేజ్గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ఫర్డ్లోని పీహెచ్డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు. -
టెక్ కుబేరుల అడ్డా.. ఈ నగరమే!
కాలిఫోర్నియా సరికొత్త టెక్ బిలియనీర్ గా ఈ ఏడాది ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అవతరించారు. 54 బిలియన్ డాలర్ల (రూ.36,0747 కోట్ల) సంపదతో టెక్ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఆయన.. ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎలిసన్ను అధిగమించారు. గత ఏడాది కాలిఫోర్నియా అత్యంత సంపన్నుడి టైటిల్ ఎలిసన్ కు దక్కింది. ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన రెండో వార్షిక టెక్ కుబేరుల జాబితాలో జ్యూక్ మొదటి స్థానంలో నిలువగా.. రెండోస్థానంలో ఎలిసన్ నిలిచారు. టాప్ 100 మంది టెక్ బిలియనీర్లతో ఫోర్బ్స్ జాబితా రూపొందించగా అందులో 37 మంది టెక్ దిగ్గజాలు అమెరికాలోని కాలిఫోర్నియాలోనే నివసిస్తుండటం గమనార్హం. టెక్ మహా సంపన్నులుగా కీర్తి గడించిన వీరి ఉమ్మడి సంపద 332.4 బిలియన్లు కాగా.. ప్రపంచ టాప్ 100 టెక్ కుబేరుల సంపదలో ఇది మూడోవంతు కావడం విశేషం. గత ఏడాది ఫేస్ బుక్ షేర్ విలువ రాకెట్ వేగంతో పెరిగిపోవడంతో జుకర్ బర్గ్ సంపద అమాతం పెరిగిపోయింది. ఫేస్ బుక్ స్టాక్ విలువ ఏకంగా 30శాతం పెరుగడంతో ఆయన సంపదకు అదనంగా 12.8 బిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇక తన జీవితకాలంలో ఫేస్ బుక్ లోని 99శాతం వాటాను సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తానని ప్రకటించి జ్యూక్ తన ఉదారగుణాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. టెక్ కుబేరుడిగా ఫోర్బ్స్ జాబితాలో రెండోస్థానంలో ఉన్న ఒరాకిల్ స్థాపకుడు ల్యారీ ఎలిసన్ సంపద గత ఏడాదికాలంలో ఏమంతగా పెరుగలేదు. దీనికితోడు ఒరాకిల్ స్టాక్ విలువ గతంలో పడిపోయినప్పటికీ.. అది రికవరీ చేసుకోవడానికి గడిచిన ఏడాది సరిపోయింది. ఎలిసన్ నికర సంపద ప్రస్తుతం 51.7 బిలియన్ డాలర్లు (రూ. 34,5381 కోట్లు)గా ఉంది. ఈ ఇద్దరే కాదు కాలిఫోర్నియాకు చెందిన పలువురు టెక్ దిగ్గజాలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీపేజ్, సెర్గీ బ్రిన్ వరుసగా 39 బిలియన్ డాలర్లు, 38.2 బిలియన్ డార్లతో ఈ జాబితాలో చేరారు. గూగుల్ స్టాక్ విలువ 20శాతం పెరుగడంతో వీరి సంపద ఉమ్మడిగా 11బిలియన్ డాలర్లమేర పెరిగింది. ఇక కాలిఫోర్నియాలో నివసించే ఐదో రిచెస్ట్ టెక్ బిలియనీర్ గా గూగుల్ చైర్మన్ ఎరిక్ షుమిడ్ట్ 11.2 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. కాలిఫోర్నియాకు చెందిన ఏకైక మహిళ టెక్ బిలియనీర్ గా మెగ్ వైట్మన్ నిలిచారు. హ్యావ్లెట్ పాకర్డ్ ఎంటర్ ప్రైస్ సీఎవో అయిన ఆమె 2.2 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈ-బే కంపెనీకి ఒక దశాబ్దంపాటు సీఈవోగా వ్యవహరించిన వైట్మన్ కు ఆమె సంపదలో అధికమొత్తం 'ఈబే' ద్వారానే దక్కింది.


