బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.
ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.
సెయిల్ బోట్‌ల రేసింగ్ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్‌పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.
ఇదీ చదవండి: కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీ
Larry Ellison on success being directly correlated to questioning limits and conventional wisdom pic.twitter.com/gD87fTVxP8
— prayingforexits 🏴☠️ (@mrexits) October 24, 2025


