అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.
1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్‌మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్‌లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్‌డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.
Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5
— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025
ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn
— DogeDesigner (@cb_doge) November 22, 2025


