
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్‌ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.
పిల్లల షోలలో ట్రాన్స్‌జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్‌ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్‌ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్‌ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.
Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp
— Elon Musk (@elonmusk) October 1, 2025