స్టార్‌లింక్ అక్టోబర్ 30 (నేడు), 31న తమ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సెక్యూరిటీ, సాంకేతిక ప్రమాణాల పరీక్షలను ముంబైలో నిర్వహించనుంది. కంపెనీకి ప్రొవిజనల్‌గా కేటాయించిన స్పెక్ట్రం ఆధారంగా ప్రభుత్వ ఏజెన్సీల సమక్షంలో వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్టార్‌లింక్‌కు సంబంధించి కొన్ని అంశాలు..
ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్‌ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉండొచ్చు.
మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్‌నెట్ అందిస్తారు.
వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
హార్డ్ వేర్ కిట్‌లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.
ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్‌టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.
2025 చివరి నాటికి భారత్‌లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ‘ఆదాయపన్ను తగ్గించాలి’


